- Advertisement -
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. తనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తిలో విష్ణువర్ధన్ ఉన్నారు. సాయంత్రం కాంగ్రెస్‌కు రాజీనామా చేసే యోచనలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా విష్ణు దిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఎంపి అజారుద్దీన్ కు కేటాయించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ నుంచి గతంలో 2004,2009లో విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. 2014, 2019లో మాగంటి గోపీనాథ్ పై విష్ణు వర్ధన్ రెడ్డి ఓటమిని చవిచూశారు.
- Advertisement -