Monday, December 23, 2024

చంపాపేట హత్య కేసు: యువతిని చంపింది భర్తే.. ప్రియుడు పరార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ చంపాపేటలో యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. యువతిని హత్య చేసింది.. ఆమె భర్త ప్రేమ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భర్త ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. వివాహేతర సంబంధంతోనే యువతి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ్ కుమార్ ఇంటికొచ్చేసరికి ప్రియుడితో తన భార్య స్వప్న ఉండటాన్ని చూసి.. కోపంతో రగిలిపోయిన ప్రేమ్ కుమార్, భార్య, ఆమె ప్రియుడితో గొడవపడినట్లు చెప్పారు.

ఇంట్లో ఉన్న కత్తితో తన భార్య స్వప్నను పొడవడంతో ఆమె మృతి చెందిందని.. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియుడు తప్పించుకునే ప్రయత్నంలో ప్రేమ్ కుమార్ పై దాడి చేసి భవనం పై నుంచి తోసేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రేమ్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News