Monday, December 23, 2024

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మామడ ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

మామడ: ఓ కేసు విషయంలో ఎస్‌ఐ లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడిన సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ రాజు ఎసిబి వలలో చిక్కుకున్నారు. ఎసిబి డిఎస్పీ రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం… మామడ మండలంలోని అనంతపేట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్, సల్కం సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన సుప్పరి నరేష్ అనే కిరాణ షాప్ యజమానితో ఈ నెల 24వ తేదిన గొడువకు పాల్పడ్డారు.

ఈ విషయమై సుప్పరి నరేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సల్కం సతీష్, సల్కం సురేష్‌లపై సెక్షన్ 323, 341, 291 ప్రకారం వారిపై కేసు నమోదు అయింది. ఈ విషయమై నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తానని ఎస్సై రాజు రూ. 10 వేలకు లంచం అడిగి, బేరం కుదురించుకున్నాడు. కాగా నిందితుల అన్న సల్కం తిరుమల్ ఎసిబి అధికారులను ఆశ్రయించి ముందస్తూ పథకం ప్రకారమే ఎస్‌ఐకి లంచం ఇస్తూ ఎసిబి అధికారులకు పట్టించారు. అక్కడే మాటు వేసి ఉన్న ఎసిబి అధికారులు ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఎసిబి అధికారులు ఎస్సై రాజును విచారించి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News