సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో నామినేషన్లు వేసే రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయాల వద్ద 144 సెక్షన విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న తాహసిల్దార్ కార్యాలయం, మలక్‌పేట, జిహెచ్‌ఎంసి, నేషనల్ పార్క్, డెప్ అండ్ డమ్ స్కూల్, నల్గొండ ఎక్స్ రోడ్డు, అంబర్‌పేట తహసిల్దార్ ఆఫీస్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆఫీస్, షేక్‌పేట తహసిల్దార్ ఆఫీస్, బేగంపేట సర్కిల్ 30, జోనల్ కమిషనర్ ఆఫీస్, సికింద్రాబాద్, నాంపల్లి తహసిల్ ఆఫీస్, విజయనగర్ కాలనీ, కార్వాన్ తహసిల్ ఆఫీస్, జిహెచ్‌ఎంసి కాంప్లెక్స్, అబిడ్స్,
మొఘల్‌పుర స్పోర్ట్ కాంప్లెక్స్, ఫస్ట్‌ఫోర్స్, చార్మినార్, చాంద్రాయణగుట్ట తహసిల్ ఆఫీస్, బండ్లగూడ, యాకత్‌పుర తహసిల్ ఆఫీస్, సైదాబాద్, చాంపాపేట రోడ్డు, బహదుర్‌పుర తహసిల్ ఆఫీస్, సికింద్రాబాద్ కమిషనర్ ఆఫీస్, సికింద్రాబాద్, మారేడుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, కోర్టు హౌస్ కాంపౌండ్,ఎస్‌పి రోడ్డు, సికింద్రాబాద్. నామినేషన్లు వేసే ఈ ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాలకు 100మీటర్ల వరకు ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.