Monday, December 23, 2024

తెలంగాణలో 77 సీట్లతో బిఆర్‌ఎస్ హాట్రిక్ పక్కా

- Advertisement -
- Advertisement -

స్పష్టం చేసిన రాజ్‌నీతి ఒపీనియన్ పోల్

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని రాజ్‌నీతి ఓపీనియన్ పోల్ వెల్లడించింది. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీ 77 సీట్లు గెలిచి మరోసారి అధికారం చేపడుతుందని తాజాగా నిర్వహించిన రాజ్‌నీతి సర్వేలో తేలింది. కాంగ్రెస్ పార్టీ 29 సీట్లకే పరిమితం కానుండగా, బిజెపి 6 స్థానాలతో మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుందని రాజ్‌నీతి సర్వే అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో బిఎస్‌పి పార్టీ అసలు ఖాతానే తెరిచే అవకాశం లేదని పేర్కొంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలపై హైదరాబాద్‌లోని ఆరు స్థానాలు, మునుగోడు స్థానం మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేని నిర్వహించింది. ఈ నెల 28 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన రాజ్‌నీతి సంస్థ సోమవారం సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఓట్ల శాతం పరంగా బిఆర్‌ఎస్‌కు 43.35 శాతం ఓట్లు పోలవుతాయని రాజ్‌నీతి సర్వే వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 34.81 శాతం, బిజెపికి 17.46 శాతం, బిఎస్‌సిపి 2.62 శాతం, ఇతరులకు 1.76 శాతం ఓట్లు పోలవుతాయని తెలిపింది.

గులాబీ పార్టీకి 41 శాతం ఓట్లు : ట్విట్టర్‌లో గ్రిహ అతుల్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారం మళ్లీ బిఆర్‌ఎస్ పార్టీదేనని ప్రముఖ జర్నలిసు గ్రిహ అతుల్ వెల్లడించారు. కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఈ మేరకు గ్రిహ అతుల్ ట్విట్టర్ వేదికగా సర్వే ఫలితాలను వెల్లడించారు. క్షేత్రస్థాయి నివేదిక ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 41 శాతం, కాంగ్రెస్‌కు 33 శాతం, బిజెపికి 11.5 శాతం, ఎంఎఐఎంకు 2.5 శాతం ఓట్లు వస్తాయని గ్రిహ అతుల్ అంచనా వేశారు. రీజియన్ల వారీగా ఉత్తర తెలంగాణలో మొత్తం 50 సీట్లకుగానూ బిఆర్‌ఎస్ పార్టీ 35 సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌కు 11 స్థానాలలో గెలవనుండగా, బిజెపి 4 సీట్లు గెలిచే అవకాశం ఉందని అన్నారు.అలాగే జిహెచ్‌ఎంసిలో 24 సీట్లకుగానూ బిఆర్‌ఎస్ పార్టీ 11 సీట్లు గెలుస్తుందని వెల్లడించారు. జిహెచ్‌ఎంసిలో ఎంఐఎం 7 స్థానాలలో గెలువనుండగా, కాంగ్రెస్ 4 స్థానాలలో, బిజెపి 2 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో 45 స్థానాలకుగానూ బిఆర్‌ఎస్ పార్టీ 30 స్థానాలలో విజయం సాధిస్తుందని తెలిపారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ 14 స్థానాలలో గెలవనుండగా, బిజెపి ఒక సీటు గెలిచే అవకాశం ఉందని గ్రిహ అతుల్ అంచనా వేశారు.

Survey

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News