- Advertisement -
న్యూఢిల్లీ : ఆప్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు ఆర్థిక బహుమానం ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. ‘నేను ఏ ఆటగాడికి రివార్డ్ గురించి ఐసిసి లేదా ఏ క్రికెట్ ఫ్యాకల్టీకి ఏమీ చెప్పలేదు. క్రికెట్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అటువంటి వాట్సాప్ ఫార్వార్డ్‌లు, వీడియోలు నా అధికారిక ప్లాట్‌ఫామ్ నుండి వస్తే తప్ప దయచేసి నమ్మవద్దు’ అని రతన్ టాటా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. పాకిస్థాన్‌పై విజయం తర్వాత రషీద్ ఖాన్ భారత జెండాతో సంబరాలు చేసుకున్నాడనే పాకిస్థాన్ ఫిర్యాదు మేరకు ఐసిసి రూ.55 లక్షల జరిమానా విధించింది. అయితే రతన్ టాటా రషీద్ ఖాన్‌కు రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారని వాట్సాప్‌లలో సందేశాలు వైరల్ అయ్యాయి. దీనిపై రతన్ టాటా స్పందిస్తూ, ఇలాంటి వాట్సాప్ మెసేజ్‌లు, వీడియోలను నమ్మవద్దని సూచించారు.
- Advertisement -