Monday, December 23, 2024

ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గం బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హింసను కోరుకోదన్నారు. అహింస మూల సిద్ధాంతంగా పార్టీ పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై వెంటనే పూర్తిస్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపి విషయాలను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News