Wednesday, January 22, 2025

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన ఎంఐఎం

- Advertisement -
- Advertisement -
త్వరలో కోలుకోవాలంటూ ఆకాంక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి తీవ్రంగా ఖండించారు. తన సహచర ఎంపి అయిన ప్రభాకర్ రెడ్డి అల్లాహ్ కృపతో త్వరగా కోలుకొని తిరిగి మైదానంలోకి వస్తారని ఆశిస్తున్నానంటూ అసదుద్దీన్ ట్విట్ చేశారు. ‘ఆగే మొహబ్బత్ కి దుకాన్ ఔర్, పీఛే తషద్దుద్ కా మకాన్’ అంటూ ఆయన కాంగ్రెస్ పై ముఖ్యంగ రాహుల్ గాంధీపై వ్యంగస్త్రాలు సంధించారు. ప్రభాకర్ రెడ్డిని బెదిరించేందుకు కాంగ్రెస్‌వారు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండించాలి అన్నారు. కాంగ్రెస్ పాలనలో అక్టోబర్ 31న ప్రారంభమైన 1984 సిక్కు వ్యతిరేక హింసాకాండకు ఇది దురదృష్టకర ఫ్లాష్‌బ్యాక్… ఆర్‌ఎస్‌ఎస్ గారూ! అంటూ ఓవైసి రేవంత్ నుద్దేశించి ట్వీట్ చేశారు. ‘మీ ప్రభావం చాలా కనిపిస్తోంది, మంచి పని’ అని ఓవైసి అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News