Saturday, November 23, 2024

చట్ట సభల గళం కామ్రేడ్ ఓంకార్

- Advertisement -
- Advertisement -

భారత మార్చిస్టు కమ్యూనిస్టు పార్టి (ఐక్య) ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామేడ్ మద్దికాయల ఓంకార్ గారు అమరులై తేది 17.10.2023 నాటికి 15 సంవత్సరాలు అవుతున్నది. కామేడ్ ఓంకార్ గారు నాటి నల్లగొండ నేటి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. తన 14వ ఏటనే గ్రామాలలో భూస్వాములు – నాటి నైజాం పరిపాలనలో ఖాసీం రజ్వి సేవలు కొనసాగిస్తున్న దోపిడి, వెట్టిచాకిరి, బానిసత్వానికి, మహిళలపై సాగిస్తున్న దారుణ కృత్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొంది దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా నాయకునిగా నైజాం రజాకారు, భూస్వామ్యశక్తుల ఆగడాలపై మడమతిప్పని పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో భూస్వాముల భూములను పేదప్రజలకు పంచటంలో ప్రముఖపాత్ర పోషించారు. కామ్రేడ్ ఓంకార్ గారు ఉద్యమపోరాట కాలంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి ప్రాంత పోరాటాలలో, ఆదివాసీలతో మమేకం అయ్యి, నిర్వహించిన పాత్ర గణనీయమైనది.

పోరాట విరమణ తరువాత పార్టీ నిర్ణయం మేరకు వరంగల్ జిల్లాలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1964లో మార్శిస్టు పార్టి నిర్మాణంలో, 1984 నుండి పార్టి వ్యవస్థాపకనేతగా అమరత్వం పొందేవరకు యంసిపిఐ(యు) పార్టి నిర్మాణంలో ప్రధాన భూమిక కా॥ఓంకార్‌గారు పోషించారు. 1972లో నర్సంపేట శాసనసభ స్థానం నుండి 1994 వరకు ఐదుసార్లు గెలుపొంది, 22 సం॥ శాసనసభ్యునిగా బడుగు, బలహీన, పీడిత ప్రజల గొంతుక అయ్యినందుకు ప్రజలే కామేడ్ ఓంకార్ గారిని అసెంబ్లీ టైగర్ అని సంబోధించారు. ఇది సహించలేని భూస్వామ్య గూండాలు నాటి కాంగ్రెస్ , పీపుల్స్ వార్ నక్సలైట్లు ఐదు సార్లు హత్యా ప్రయత్నం కావించారు. కామ్రేడ్ ఓంకార్ గారు మృత్యుంజయుడిగా ప్రజలమధ్య నిల్పారు. భారతదేశ వ్యవస్థను, కమ్యూనిస్టు ఉద్యమ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిన కామ్రేడ్ ఓంకార్ గారు దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని నూటికి 93% ఉన్న బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని, ఏ బూర్జువ పార్టి ప్రజలకు ప్రత్యామ్నాయం కాదు కమ్యూనిస్టు-సామాజిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు.

మార్చిజం ద్వారా వర్గ నిర్మూలను చేధించాలని, అంబేద్కర్ ఆలోచన విధానంతో అసమానతను రూపుమాపాలని 1984 నుండి అనేక ప్రయత్నాలు కొనసా గించారు. వర్ష వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ ఉందని, కులవ్యత్యాసాలతో పాటు మతోన్మాధ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నిర్వహిస్తూ తను జీవించి ఉన్నంత కాలం పోరాడినారు.
ఆదునిక శాస్త్ర సాంకేతికతతో ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న మనదేశ వ్యవస్థను ఈ 10 సంవత్సరాలలో శాస్రీయ దృక్పదాన్ని ప్రజలకు దూరం చేస్తూ మూఢవిశ్వాసాల, ఆశాసప్రీయ విధానాలే ప్రాధాన్యంగా తన మనువాధ భావజాలాన్ని ప్రజలలో పెంపొందిస్తూ ఫాసిస్టు నియంతృత్వ పాలనను ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాలిస్తుంది. నేటి విద్యతోపాటు అనేక వ్యవస్థలలో కాషాయీకరణను ప్రవేశపెట్టి మనువాద అమలుకు పూనుకుంది. భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన సామ్యవాద (సోషలిస్సు, లౌకిక (సెక్యులర్) పదాలను తొలగించి డా॥బి. ఆర్. అంబేద్మర్ గారు వ్రాసిన భారతరాజ్యాంగాన్ని దాని విలువలను కాలరాసింది. దేశశ్రామిక వర్షానికి పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు చెప్పుకోదగిన జీవన విధానాన్ని సమకూర్చడంతోపాటు, ఆర్థిక సమానతను దేశ ఆదాయాన్ని న్యాయోచిత రీతిలో పంపిణి అయ్యేటట్లు చేడడం, కొందరికి కాకుండా అందరి యోగక్షేమాలను కోరడమే సామ్యవాద లక్ష్యం. లౌకికం అంటే ఒకానొక మతాన్ని రాజ్యమతంగా గుర్తించని రాజ్యమని అర్ధం.

1976 రాజ్యాంగ సవరణ ద్వారా 25 నుండి 28 వరకు గల ఆర్టికిల్స్‌లోనూ అంతరాత్మననుసరించి స్వాతంత్య్రము, స్వేచ్చాయుత మతావలంబించిన, ఆచరణ ప్రచారముల యొక్క స్వేచ్చను ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ప్రభుత్వము అన్ని మతాల పట్ల తటస్థ్యృతను, నిష్పాక్షితను చూపాల్సియుంది. లౌకికత్వం భారతరాజ్యాంగ ప్రాథమిక లక్షణాలలో ఒకటిగా పరిగణించబడింది, సార్వభౌమ్యా, సామ్యావాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాముగా ఉన్న రాజ్యాంగపదాలను, వివరణను నేడు బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో తనకున్న బలముతో ముజువాణి ద్వారా రాజ్యాంగ పదాలను మార్చుతూ తన మనువాద ధర్మాణిచొప్పిస్తుంది. దేశానికి బలమైన శక్తిగా ఉన్న ప్రజాస్వామ్యానికి బదులుగా ధర్మశాసనం పేరుతో ప్రజలపై మతద్వేషాలను పులుముతుంది బిజెపి ప్రభుత్వం. ప్రజలపై కొనసాగుతున్న మతదాడులలో మనువాద సిద్ధాంతం బలమైనది. ప్రపంచంలోని అన్నిమతాలు, మత (గ్రంధాలు, మత ప్రవక్తలు, ఏ బాషలో చెప్పిన సారాంశం ఒక్కటే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అని మతప్రామాణిక గ్రంధాలు, వేదాలు, (బ్రాహ్మణాలు, అరణ్యాలు, ఉపనిషత్తులు, పురాణాలు, హితాహాసాలు, మనుధర్మశాస్తాలతో ఉన్న హైందవ మతం కూడా సర్వం భగవంతుని సృష్టిగానే భావిస్తుంది.

అన్ని మతాల భావాలు మన దేశంలో ఉన్నా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య, గణతంత్రతో మన దేశానికి లౌకికత్వం ఒక ప్రత్యేక బలం. భారత రాజ్యాంగం క్రింద ప్రజాస్వామ్యం అంటే సామాజిక, ఆర్థిక్క రాజకీయ, న్యాయ, భావప్రకటన, స్వాతంత్య్రం, మతవిశ్వాసాలు, ఆరాధనలు, స్వేచ్చా, సమాన ప్రతిపత్తి అంశాలతోపాటు ప్రాధమిక హక్కులైన విద్యా, వైద్యం, కూడు, గూడు లాంటివి కూడా ఉన్నవే. ఇవి రాజ్యాంగంలోని లౌకికత్వం వర్ధిల్లాలని భారతప్రజానికం దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టినట్లు లౌకికత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాని ఇప్పటివరకు ఈ 78 సంవత్సరాలలో పరిపాలన చేసిన పాలకులు లౌకిక రాజకీయ సిద్దాంతం పేరుతో దేశాన్ని పరిపాలిస్తూ ప్రజలను మోసగిస్తూ వచ్చారు. రాజకీయ ఆర్థిక, సామాజిక అంశాలను ప్రజలకు అందనంతదూరం చేసి దేశాన్ని ఏలారు. అది ఒక ఎత్తు అయితే ఈ 10 సంవత్సరాల బిజెపి ప్రభుత్వం తన పార్లమెంటు బలాన్ని చూపిస్తూ భారత రాజ్యాంగాన్ని తనకు అవసరమైనప్పుడల్లా సవరించుకుంటూ వస్తుంది. అందులో భాగమే భారత స్వాతంత్ర ప్రజాస్వామ్యానికి పునాది అయిన లౌకికత్వానికి గోరీ కట్టి మనువాద భావజాల వర్ణవ్యవస్థను బలోపేతం చేస్తూ దేశంలో మత, కుల ఉన్నాదాలను ’పెంచిపోషిస్తుంది.

మరోపక్క ఫాసిస్టు నియంతృత్వ విధానాలతో, తన పాలనకు ఎదురులేదు అనే దీమాతో కేంద్ర, స్వతంత్ర సంస్థలు అయిన ఇ.డి., సి.ఐ.డి.ని, అవినీతి నిరోధక శాఖను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకొనుటకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నా లొంగని రాజకీయ పార్టీ నాయకులపై, పౌరహక్కుల నాయకులపై ప్రింట్ మీడియా, ఎలక్షానిక్ మీడియా పై దాడులు చేస్తూ దేశద్రోహ నేరాలు మోపి ఏ ఆధారాలు లేకుండానే సంవత్సరాల తరబడి జైళ్ళలో పెడుతున్నారు. అశాస్త్రీయమైన విద్యను పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి అమ్ముతున్నది. న్యాయవ్యవస్థను, స్వతంత్య్ర వ్యవస్థను, ఎన్నికల కమీషన్ స్వతంత్రంగా నడవనీయటం లేదు. ఒకేదేశం, ఒకేబాష అనే కామన్ కోడ్ పేరుతో మరియు జమిలి ఎన్నికలు ప్రవేశపెట్టి అధ్యక్షతరహా పాలన కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుచున్నవి.
ఈ నేపథ్యంలో పౌరహక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి బావసారూప్యం కలిగిన మేధావులు, వ్యక్తులు, శక్తులు, వామపక్ష్మప్రజాతంత్ర పార్టీలు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి 15వ వర్దంతి కార్యక్రమాన్ని యంసిపిఐ(యు) రాష్ట్ర వ్యాప్తంగా 2023 అక్టోబర్ 17 నుండి 31 వరకు మనువాదం -రాజ్యాంగం అనే అంశంపై కార్యక్రమాలు చేపట్టాము. అక్టోబర్ 31న ఓంకార్ భవన్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో ముగింపు సందర్భంగా రాష్ట్ర సదస్సు కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపునిస్తున్నది.

వనం సుధాకర్
9989220533

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News