Friday, December 20, 2024

కోడికత్తి.. అని చిల్లరగా మాట్లాడుతున్నారు: హరీష్‌ రావు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

మెదక్ బిఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విషయంలో ప్రతిపక్ష నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు.

ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోందని చెప్పారు. ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. కోడికత్తి.. అని చిల్లర మాటలు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు దిగజారుడు, దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా కొట్లాడాలి.. కానీ, ఇలా చిల్లర హత్య రాజకీయాలు చేయకూడదని విమర్శించారు.ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుపుతున్నారని తెలిపారు. నిందితుడి ఫోన్ కాల్స్ ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని హరీష్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News