2006లో ‘ది ప్రెసిడెంట్ ఈజ్ కమింగ్’ అనే కామెడీకి దర్శకత్వం వహించిన కునాల్ రాయ్ కపూర్, ‘జస్ట్ మొహబ్బత్’ (1997), ‘ముంబయి కాలింగ్’ (2009), ‘ఢిల్లీ బెల్లీ'(2011), ‘యే జవానీ హై దీవానీ'(2013), అనేక చిత్రాలలో ప్రతిభా వంతుడైన నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. జీ థియేటర్ యొక్క ఉత్కంఠభరితమైన టెలిప్లే, ‘షద్యంత్ర’లో పరిశోధనాత్మక పోలీసు అధికారిగా ముఖ్యమైన పాత్ర పోషించిన ఆయన, దాని ఆకట్టుకునే కథాంశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆయనే తన నమ్మకానికి గల కారణాన్ని వివరిస్తూ “దక్షిణ భారతదేశంలో కొన్ని ఉత్తమ సస్పెన్స్‌ఫుల్ థ్రిల్లర్లు రూపొందించబడ్డాయి, తెలుగు ప్రేక్షకులు ‘షడ్యంత్ర’ని ఆదరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ నాటకంలో చమత్కారమైన మలుపులు, అద్భుతమైన ప్రదర్శనలు, వున్నత స్థాయి నాటకీయత ఉన్నాయి. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడటం, విస్తృత శ్రేణి లో ప్రేక్షకుల మన్నన పొందడం పట్ల నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను” అని అన్నారు
అత్యాశతో కూడిన కన్స్ట్రక్షన్ మేనేజర్ రోహన్ తివారీ తన భార్య నటాషా మరణాన్ని తనకు అనుకూలముగా చేసుకోవడం ద్వారా ఆమె కంపెనీని స్వాధీనం చేసుకోవాలనుకునే కుతంత్రాలతో కథ ప్రారంభమవుతుంది. అయితే, బాగా ఆలోచించి అమలు చేసిన హత్య ప్లాన్ బెడిసికొట్టి, ఊహించని హత్య జరుగుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే సంఘటనలు ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ మిస్టరీ చేధించే పోలీసు అధికారి మోహన్ ఖన్నా పాత్రను కపూర్ పోషించాడు.
దక్షిణ భారతదేశంలోని థియేటర్, సినిమా యొక్క గొప్ప వారసత్వం గురించి కపూర్ మాట్లాడుతూ “నేను ప్రాంతీయ నాటక రచయితలు, చిత్రనిర్మాతలను బాగా ఆరాధిస్తాను. కన్నడకు చెందిన ‘హయవదన’ వంటి ప్రాంతీయ క్లాసిక్‌ల యొక్క కొన్ని అద్భుతమైన ఆంగ్ల అనుసరణలలో నేను భాగమయ్యాను. గొప్ప నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీష్ కర్నాడ్ రచించిన నాటకం అది. మేము ముంబై, కోల్‌కతాలో ప్రదర్శనలు చేసాము, అవి చాలా బాగా ప్రశంసించబడ్డాయి. నేను ఒక తెలుగు చిత్రంలో పనిచేశాను, కన్నడ సినిమాలో కూడా పనిచేయాలనుకుంటున్నాను” అని అన్నారు. మరిన్ని టెలిప్లేలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడాలని కపూర్ అభిప్రాయపడ్డారు.
ఈ టెలిప్లేకి గణేష్ యాదవ్ దర్శకత్వం వహించారు. హీనా ఖాన్, చందన్ రాయ్ సన్యాల్, శ్రుతి బాప్నా కూడా ఇందులో నటించారు. నవంబర్ 4న ఎయిర్టెల్ థియేటర్, డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్, డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్‌లలో ప్రసారం కానుంది.