- జిల్లా ఎన్నికల అధికారి పమేల సత్పతి
శాతవాహన యూనివర్సిటీ: రాబోయో అసెంబ్లి ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి తెలిపారు. మంగళవారం చొప్పదoడి, కరీంనగర్ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ మెటీరియల్, ర్యాండమైజేషన్ ప్రక్రియ తదితర వివరాలను గు రించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్, చొప్పదండి నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్, డి స్ట్రిబ్యూషన్ సెంటర్‌లను పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్‌లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను ఆర్వోలు సమీక్షించు కోవాలని, కౌంటింగ్ కొరకు కళాశాలలో ప్రవేశం, బయటకు వెళ్లేదారి, పార్కింగ్ లలో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవాలని తెలిపారు.
ఇంకా ఎమైన అవసరం ఉన్నట్లయితే వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశా య్, కరీంనగర్ ఆర్డీఓ కే. మహేశ్వర్, తహసీల్దార్లు రమేష్, రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.