- Advertisement -
కొల్లాపూర్ సభకు హాజరైన రాహుల్‌గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: పాలమూరు ప్రజా గర్జన సభలో పాల్గొనాల్సిన ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తన పర్యటనను ప్రియాంక రద్దు చేసుకున్నట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం మంగళ, బుధవారాల్లో ప్రియాంక, రాహుల్ పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాలతో ప్రియాంకగాంధీ రాలేకపోతున్నట్లు సమాచారం. ఇవాళ ప్రియాంక గాంధీ పాల్గొనాల్సిన సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. దీంతో ఒక రోజు ముందే తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ రావడం విశేషం.
LIVE: Shri @RahulGandhi addresses the public in Kollapur, Telangana. https://t.co/G6mWjQaddQ
— Congress (@INCIndia) October 31, 2023
- Advertisement -