డిసిపిలకు అప్లికేషన్ పెట్టుకోవాలి
ప్రకటనలో పేర్కొన్న సైబరాబాద్ సిపి
మనతెలంగాణ, సిటిబ్యూరోః ఈ ఏడాది దిపావళి క్రాకర్స్ విక్రయించేందుకు షాపుల ఏర్పాటుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలికంగా లైసెన్స్‌ను 1884, 1983 యాక్ట్ కింద జారీ చేస్తారని తెలిపారు. లైసెన్స్ కోసం ఆయా జోన్ల డిసిపిలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తాతాల్కిక లైసెన్స్ కోసం ఎఈ- 5 ఫార్మ్‌ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు.
ఈ నెల 5వ తేదీ లోపు లైసెన్స్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లైసెన్స్ కోసం ఫైర్ ఆఫీసర్ నుంచి ఎన్‌ఓసి, జిహెచ్‌ఎంసి నుంచి ల్యాండ్ అనుమతి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఎన్‌ఓసి, గతంలో జారీ చేసిన లైసెన్స్, ఎక్కడైనా సింగిల్ షాపు ఏర్పాటు చేస్తే పక్కన ఉన్న వారి అనుమతి తీసుకోవాలి, సైట్ ప్లాన్‌కు సంబంధించిన బ్లూప్రింట్, లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఎస్‌బిఐలో రూ.600 ఫీజు కట్టాలి.