మీటర్ కోసం రూ.30వేలు డిమాండ్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎసిబి అధికారులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః విద్యుత్ మీటర్ బిగించేందుకు డబ్బులు తీసుకుంటుండగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఎడిఈ, సబ్ ఇంజనీర్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గచ్చిబౌలి, సైబర్‌సిటీ సర్కిల్ చెందిన ఎడిఈ (ఆపరేషన్స్), సబ్ ఇంజనీర్ కలిసి రూ.20,000 నగదు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. మంగళ్‌హాట్, సీతారాంపేటకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ సందీప్‌కుమార్ ఎలక్ట్రిక్ మీటర్ ప్రాతిపాదిత ఫైల్‌ను రెఫర్ చేసి డిఈఈకి పంపించేందుకు ఎడిఈ, సబ్ ఇంజనీర్‌ను బాధితుడు సంప్రదించాడు.
దీనికి వారు రూ.30,000 లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దానిని అంగీకరించిన బాధితుడు లంచం డిమాండ్ చేసిన విషయం ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు ఎఈడి, సబ్ ఇంజనీర్‌కు డబ్బులు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. తర్వాత ఎసిబి అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో వారు లంచం తీసుకున్నట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.