Saturday, December 21, 2024

క్రైమ్ కామెడీ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’ . శ్రీభారత ఆర్ట్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ “కథ అంతా సిద్ధం చేసుకుని సినిమా తీయడానికి నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించా. అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్ చేసి డబ్బు పెట్టారు. అందువల్లే ఈ సినిమా పూర్తయింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మౌనిక కలపాల, సోనియా, కిరీటి దామరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News