Friday, December 20, 2024

మేకింగ్ కొత్తగా ఉంటుంది

- Advertisement -
- Advertisement -

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్.ఎస్ నిర్మించిన చిత్ర విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మేకింగ్ కొత్తగా ఉంటుంది. రోహిత్, ఆనంది చక్కగా నటించారు” అని అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ రంగనాథన్ మాట్లాడుతూ “రోహిత్ ఎంత అద్భుతంగా నటించాడనేది నవంబర్ 3న ప్రేక్షకులకు తెలుస్తుంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ వేరే లెవెల్లో నటించారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రంగనాథన్, రోహిత్ నందా, శ్రీచరణ్ పాకాలా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News