Friday, December 20, 2024

ఇంకా ఆధారాలు కావాలా రాహుల్ ?: మంత్రి కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం విదితమే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ దానిని కప్పిపుచుకునేందుకు నకిలీ ఫొటోలు, వీడియోలతో మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడిచేసింది కాంగ్రెస్ గూండానే అంటూ ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా? అని పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.

Gatani Raju

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News