Friday, December 20, 2024

విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు నా బాధ్యత : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ఎంఎల్‌ఎ, పిజెఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తు తన బాధ్యత అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. పిజెఆర్ తనకు వ్యక్తిగతంగా మిత్రుడు అని, విష్ణు కూడా నా కుటుంబ సభ్యుడే అని పేర్కొన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని, ఆయన భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాను అని కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ గురించి పిజెఆర్ అద్భుతమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రజలు, సామాన్యుల కోసం రాజీ పడకుండా పోరాడిన పాపులర్ నాయకుడు పిజెఆర్ అని, ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చాలా ఉత్సాహవంతుడు అని వ్యాఖ్యానించారు. ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి క్రియాశీలకంగా తమతో పని చేస్తానని చెప్పారని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News