Monday, January 20, 2025

అంబానీకి మూడో బెదిరింపు ఈమెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత సంపన్ను డు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ ముకేశ్ అంబానీ సోమవారం ఉదయం మూడో డెత్ థ్రీట్ (మరణ బెదిరింపు) ఈమెయిల్ వచ్చింది. మెయిల్ పంపిన దుండగులు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశా డు. గతంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు అక్టోబర్ 30న ఆయనకు మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. సోమవారం ఉ దయం ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ మెయిల్ ఐడీకి ఈ-మెయిల్ వచ్చిందని గామ్‌దేవి పోలీసులు తెలిపారు. దీనిలో రూ.400 కోట్లు డిమాండ్ చేశారు. తన డిమాండ్లను నెరవేర్చకుంటే చంపేస్తామని బెదిరించారు. అంతకుముందు అక్టోబర్ 27న మెయిల్‌లో రూ.20 కోట్లు డిమాండ్ చేయగా, అక్టోబర్ 28న రూ.200 కోట్లు డిమాండ్ చేశారు. దేశంలోని అత్యుత్తమ షూ టర్లచే చంపుతామని మెయిల్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News