Saturday, November 23, 2024

టికెట్ రాలేదని… సొంత గూటికి రామ్మోహన్ గౌడ్..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశించిన రామ్మోహన్ గౌడ్.. మధయాష్కి గౌడ్ కు టికెట్ కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ను వీడి మళ్లీ బిఆర్ఎస్ లోకి వెళ్లారు. బుధవారం ఎల్బీనగర్ లోని రామ్మోహన్ గౌడ్ నివాసానికి మంత్రి హరీష్ రావు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు సమక్షంలో రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వారికి గులాబీ కండువా కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం హరీష్ రావు మాట్టాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని, తనతో కలిసి పని చేశాడు..
సహచరుడిని కాపాడుకోవాలని వచ్చానన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడని… ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి అని చెప్పారు. రెండు సార్లు టికెట్ ఇచ్చామని.. కాని, స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని మంత్రి తెలిపారు.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని.. 11 మంది కార్పొరేటర్లు గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారని.. రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు. పార్టీ ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చానని… మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందామని అన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని, డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నట్లు.. వారి పరిస్థితి ఉందని తెలిపారు. అన్ని సర్వేలు బిఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని.. మూడోసారి కెసిఆర్ సిఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా.. గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని ప్రజలు ఆలోచిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News