Sunday, January 19, 2025

ఖమ్మం జిల్లా సీనియర్ నేతపై సిఎం కెసిఆర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: బిఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సత్తుపల్లిలో భారాస ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ పాల్గొన్నారు. ఓట్ల కోసమే దళితబంధు తెచ్చిఉంటే.. మేనిఫెస్టోలో పెట్టేవాళ్లం అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు అమలు చేశామని సిఎం స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక మండలం మొత్తం దళితబంధు ఇచ్చామని సిఎం వెల్లడించారు.

పథకం పరిశీలన కోసం నలుమూలల నాలుగు జిల్లాల్లో అమలు చేశామని ఆయన సూచించారు. ఆరునూరైనా మళ్లీ గెలిచేది… బిఆర్ఎస్ పార్టీయే అని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేత అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బిఆర్ఎస్ నేతను అసెంబ్లీ గేటు తాకనీయనంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందో… ఆలోచించాలి. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించాలని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News