మేషం – వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశం ఉంది. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్త శ్రవణం చేస్తారు.
వృషభం – ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా లేఖకి మీరు ప్రతిస్పందిస్తారు. తలపెట్టిన కార్యం జయం అవుతుంది.
మిథునం – విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చ. అకారణంగా ఒక మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది.
కర్కాటకం – ధైర్యంతో తీసుకున్న ఒక నిర్ణయం నరికొత్త మలుపుకు దారి తీన్తుంది. కనిపించని కృతజ్ఞత కొరకు ఎదురు చూసి నిరాశ పడతారు. దైవ దర్శనం చేనుకుంటారు.
సింహం – మీ పరిజ్ఞానానికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ బాధ్యతలు సంర్ధవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగానికి, వ్యాపారానికి సంబందించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు.
కన్య – తొందరపాటు మాటలు మిమ్మలని ఇబ్బందులకు గురిచేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. సంస్థలో మీ నహచరుల సౌజన్యంతో కలిసి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
తుల – మీ తెలివితేటలు నైపుణ్యం ప్రదర్శించటానికి ఒక చక్కని అవకాశము మీ ముందుకు వస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.
వృశ్చికం – ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు వలన ఆర్థికంగా లాభపడతారు. రహస్య శత్రువులు వెలుగులోకి వస్తారు. నరఘోష అధికంగా ఉంటుంది. శుభవార్తా శ్రవణం చేస్తారు.
ధనుస్సు- వివాదాలకు విభేదాలకు దూరంగా ఉండండి. నీలాప నిందలకు తావు లేకుండా ఉండటానికి ఈ సూచన చేయడం జరిగింది. ఆర్థిక నంబంధ వ్యవహారాలలో లోటు పాట్లు తప్పక పోవచ్చు.
మకరం – కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపాల వలన మీకు అందవలసిన కీలక సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు. ఆందోళన వద్దు. ఆలస్యం అయినా తప్పకుండా ఫలితాలు అందుకుంటారు.
కుంభం – గృహ సమస్యల నుండి బయట పడతారు. స్నేహితులతో ఒప్పందాలు బలబతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి, శారీరక ఇబ్బందులు అధికంగా బాధించే సూచనలు ఉన్నాయి.
మీనం – ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. దైవ ధర్శనం మంచి ఫలితాలను చేకూర్చుతుంది.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225