Thursday, December 19, 2024

నేడు మేడిగడ్డకు రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం మేడిగడ్డకు వెళ్ళనున్నారు. మహదేవ్‌పూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. ఇటీవల పిల్లర్లు కుంగిపోవడంతో దానిని చూసేందుకు రాహుల్ వెళుతున్నారు. గురవారం రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో అంబటిపల్లికి వెళ్ళనున్నారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఈసి అనుమతిచ్చింది. ముందుగా అనుమతివ్వకున్నా ఆ తర్వాత ఈసి అనుమతించింది. మంథని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ దుద్దిళ్ల శ్రీదర్ బాబు బుధవారం హెలిపాడ్ స్ళలం పరిశీలించారు. గురువారం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అనంతరం అంబటిపల్లి నూతన గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేయబోయే మహిళా సదస్సులో రాహుల్ పాల్గొంటారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల గురించి మహిళలకు వివరించనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి చూసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News