Monday, December 23, 2024

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ క్రికెట్‌కు గుడ్‌బై..

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఇంగ్లండ్ ఆడే ఆఖరి మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని విల్లీ పేర్కొన్నాడు. 33 ఏళ్లకు ఆటకు గుడ్‌బై చెప్పి విల్లీ పెను ప్రపంకనలు సృష్టించాడు.

విల్లీ ఇప్పటి వరకు 70 వన్డేలు, 43 టి20 మ్యాచుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 94, టి20లలో 51 వికెట్లు తీశాడు. విల్లీ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇదిలావుంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే టి20 లీగ్‌లలో మాత్రం ఆడతానని విల్లీ వెల్లడించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News