Sunday, January 19, 2025

తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా? అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను గురువారం నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారని ఆయన వెల్లడించారు. నిర్మల్ కు మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? అని సిఎం ప్రశ్నించారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలని కెసిఆర్ సూచించారు. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టిందన్నారు సిఎం కెసిఆర్. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పదేళ్లు భారాసను ఆశీర్వదించారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News