- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా రప్పిస్తోంది. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. నామినేషన్ల పర్వం ముగిశాక, దశలవారీగా కేంద్ర మంత్రులు కూడా ప్రచారంలో పాలు పంచుకోనున్నారు. విజయం కోసం శక్తియుక్తులన్నీ ఒడ్డుతున్న బిజెపి అధిష్ఠాన ం, ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. ఇప్పటికే ప్రచారం నిమిత్తం మూడు హెలికాప్టర్లను రప్పిస్తోంది. ఇందులో ఒకటి పూర్తిగా బండి సంజయ్ కు కేటాయించారు. మరో రెండింటిని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలకు కేటాయించినట్లు తెలిసింది.
- Advertisement -