- Advertisement -
ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రకటన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల పీజు షెడ్యూల్ విడులైంది. వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి వార్షిక పరీక్షల ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 17వ తేదీలోపు విద్యార్థులు చెల్లించాలని, రూ. 50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1వ తేదీవరకు, రూ. 200లతో డిసెంబర్ 11వ తేదీవరకు, రూ. 500 రుసుముతో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్ విద్యార్థులు రూ.125 , మూడు సబ్జెక్టులకు, అంతకంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల ఫెయిలైన వారు రూ. 125, వృతి విద్యా కోర్సుల విద్యార్థులు రూ. 60 చెల్లించాలని పేర్కొంది.
- Advertisement -