Saturday, November 23, 2024

ఐటి దాడుల కలకలం

- Advertisement -
- Advertisement -

మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి ఇళ్లల్లో సోదాలు

బడంగ్‌పేట్ మేయర్ ఇంట్లోనూ తనిఖీలు

కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐటి దాడులు కలకంల రేపుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్‌ఆర్ నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బడంగపేట్ మేయర్ పారిజాత ఇంట్లో కూడా సో దాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె తిరుపతి పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌లో ఉంది. ఓవైపు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూనే ప్రత్యర్థులను ఎలా ఓ డించాలనే వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రచారంలో కీలక నేతలు ప్రజల వద్దకు వెళ్లి తాము చేసిన మంచి పనులు ప్రత్యర్థులు లోపాలను ఎత్తి చూపు తూ ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర మంలో తెలంగాణలో ఐటి దాడులు కలకలం రే పుతున్నాయి. మహేశ్వరం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కిచెన్నగారి లక్ష్మారెడ్డి నివాసంలో గురువారం ఉదయం నుంచి సోదాలు సాగుతున్నాయి. ఆయనతోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతల ఇళ్లపై కూడా ఐటి అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ సహా పది ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

లక్ష్మారెడ్డి ఫామ్‌హౌస్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన ప్రాంతాల్లో అధికారులు భారీగా పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం పారిజాత న ర్సింహారెడ్డి తిరుపతిలో ఉన్నారు. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వీళ్లతో పాటు బాలాపూర్ లడ్డు వేలం దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో పత్రాలతోపాటు కొంతడబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. దాడులు ముగిసి ఐటీ శాఖ వర్గాలు సమాచారం ఇచ్చే వరకు వాస్తవ పరిస్థితి బయటకు వచ్చే అవకాశం లేదు.
దాడులు కుట్రలో భాగమే: చిగురింత
ఐటి దాడులు రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉన్న ఆమె, ఐటీ సోదాలపై స్పందించారు. తా ము లేకపోయినా వెంటనే రావాలని ఐటి అధికారులు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
మరోవైపు శంషాబాద్ కెఎల్‌ఆర్ ఫాంహౌస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్య క్తం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేపట్టిన కార్యకర్తలు అక్కడినుంచి వెళ్లిపోవాలని అధికారులు కో రారు. ఈ నేపథ్యంలోనే కోకాపేట -హిడెన్ గార్డెన్స్ లో ఓ కాంగ్రెస్ ఎంపి తోడల్లుడి ఇంట్లో కూడా దా డులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎ స్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్న ఎంపి తోడల్లు డు ఇళ్లు, కార్యాలయాలల్లో తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News