Friday, November 22, 2024

తనిఖీల్లో రూ. 453 కోట్లకు చేరిన స్వాధీన సొత్తు

- Advertisement -
- Advertisement -

24 గంటల్లో రూ.15.04 కోట్లు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముమ్మరం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల వరకు 24 గంటల్లో రూ.15.04 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగదు : రూ.7,98,43,720, అక్రమ సరఫరాల ద్వారా పట్టుబడిన మద్యం : రూ. 28.18 కోట్లు విలువైన మద్యం, పట్టుబడిన బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులు రూ. 2.79 కోట్లు, ఇతర వస్తువులు/ఉచితాల స్వాధీనం (ల్యాప్‌టాప్ లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి మొదలైనవి) రూ. 16 కోట్లు, 24 గంటల వ్యవధిలో స్వాధీనం మొత్తం : రూ.15,04,37,088 ఉందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ రూ.4,53,93,25,718 కోట్లకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News