Monday, December 23, 2024

కేంద్రమంత్రి అమిత్‌షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ?

- Advertisement -
- Advertisement -

త్వరలో సమావేశం కావొచ్చంటున్న బిజెపి సీనియర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు గడువు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బిజెపి నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తో బిజెపి అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా మరోసారి భేటీ కానున్నారనే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత పది రోజులుగా అధికార బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. కమలనాథులు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు జాబితాల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా మరికొన్ని స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు.

ఈనెల 15 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా జనసేన పొత్తు పెట్టుకున్నట్లు, అంతేగాకుండా టాలీవుడ్‌లో మంచిపేరున్న నటుడు జూనియర్‌ను ప్రచారం రంగంలోకి దించే ఏ విధంగా ఉంటుందనే విషయాలపై బిజెపి నేతలు చర్చిస్తున్నారు. అందుకోసం అమిత్‌షా, జూనియర్ భేటీ అయ్యే అవకాశముందని ఆపార్టీ సీనియర్లు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News