Saturday, November 23, 2024

భారాసతోనే భరోసా

- Advertisement -
- Advertisement -

కార్మిక, రైతు సంక్షేమమే బిఆర్‌ఎస్ లక్ష్యం
కొత్త బీడీ కార్మికులకు సైతం త్వరలో పింఛన్
చేనేత అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక నిధులు
ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే
రైతుబంధు రూ.12వేల నుంచి 16వేలకు
కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/కోరుట్ల: బీడీ, చేనేత కార్మికులతో పాటూ రైతుల సంక్షే మం కోసమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆ యన పాల్గొని ప్రసంగించారు. భారాస (భారత రాష్ట్ర సమితి)తోనే అన్నదాతలకు భరోసా అని ఆయన అన్నారు. 19రాష్ట్రలలో బీడీ కార్మికులు ఉంటారు, కాని తెలంగాణలో మాత్రమే ఎవరు అడగకపోయిన కా ర్మికుల అవసరం కోసం పింఛన్ మంజూరు చేశామన్నారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే కొత్తగా నమోదైన బీడీ కార్మికులందరికీ పింఛను మంజూరు చేస్తామని, చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించి ఆ రంగాన్ని ఆదుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఉన్న నీటి తీరువా పన్ను విధానాన్ని తీసేసి పాత బకాయిలు మాఫీ చేసి వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పుష్కలమైన నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని కేసిఆర్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి  రాగానే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలు హాస్యాస్పదమన్నారు. ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ధరణి తీసేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి కోసం లంచం తీసుకొని దళారుల వ్యవస్థకు శ్రీకారం చుట్టి, జేబులు నింపుకునే దుష్ట ఆలోచన కాంగ్రెస్ నాయకులదని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

రైతుబంధు, రైతు బీమాతో పాటూ రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తమ బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. రైతు బంధు ఎకరానికి రూ.10వేల నుంచి క్రమంగా 12వేలకు, 16వేలకు పెంచుతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికైనా అభివృద్ధిని చూసే కొలమానం తలసరి ఆదాయమేనని, 2014లో దేశంలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ, ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అగ్రస్థానంలో ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు అందించిన పింఛన్ నెలకు 40 రూపాయలు, 70 రూపాయలు, చివరికి 200 రూపాయలు చూశాం కానీ, ఏకంగా వేల రూపాయల పింఛన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు అక్కడి ఎమ్మెల్యేలు చెబుతారని, కానీ ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే కాకముందే ప్రజల సమస్య తన దృష్టికి తెచ్చారన్నారు. ఈ ప్రాంతంలో చాలామంది కొత్తగా నమోదైన బీడీ కార్మికులున్నారని, వాళ్ళందరికీ పింఛన్ మంజూరయ్యేలా చూడాలని సంజయ్ చెప్పిన విషయానికి స్పందిస్తూ, తాము అధికారంలోకి రాగానే కొత్త బీడీ కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేయిస్తామన్నారు.

తాను ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన సమయంలో తన వెంట ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ తన ప్రాణాలు కాపాడిన బిడ్డ అని, కోరుట్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్’ని కెసిఆర్ కొనియాడారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో అభ్యర్థ్ధి గుణగణాలు చూడాలి, అభ్యర్థి వెనక ఉన్న పార్టీని చూడాలి, పార్టీ వెనక ఉన్న మంచి చెడూ పరిశీలించాలన్నారు. మంచి డాక్టర్’గా పేరు ఉండి కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా డాక్టర్ సంజయ్ ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని, మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని కెసిఆర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ చైర్మన్ దావ వసంత ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్, మున్సిపల్ చైర్’పర్సన్’లు అన్నం లావణ్య, రాణవేణి సుజాత పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం అనీల్, పలువురు కౌన్సిలర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, నియోజకవర్గ పార్టీ శ్రేణి నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News