- Advertisement -
పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో న్యూజీలాండ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది. కాన్వే 35 పరుగులకే అవుటైనా, రచిన్ రవీంద్ర, విలియమ్సన్ జోరుగా ఆడుతున్నారు.
రవీంద్ర 42 పరుగులతోనూ, విలియమ్సన్ 22 పరుగులతోనూ ఉన్నారు. తొలుత పాకిస్తాన్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓడితే, పాకిస్తాన్ కు సెమీస్ అవకాశాలు దాదాపు అడుగంటినట్టే.
- Advertisement -