Monday, December 23, 2024

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడినట్టు తెలిపింది. కింది స్థాయిలో గాలులు తూర్పు ,ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు విస్తున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపిలో కూడా ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర , ఉభయగోదావరి ,ప్రకాశం కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. రైతులు వాతావరణ పరిస్థిలను గమణిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ద్రోణి ప్రభావంతో వర్షం కురిసే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఈ వర్షం వల్ల వర్షాధారంగా సాగుచేసిన కొన్ని పంటలకు ఎంతో మేలు జరగనుందని అధికారులు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News