Saturday, December 21, 2024

‘మ్యాగీ ఓట్స్ నూడుల్స్ విత్ మిలెట్ మ్యాజిక్’ను ఆవిష్కరించిన మ్యాగీ

- Advertisement -
- Advertisement -

నెస్లే ఇండియా తన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తి పోర్ట్‌ ఫోలియోలో మ్యాగీ ఓట్స్ నూడుల్స్ సబ్-బ్రాండ్ కింద మ్యాగీ ఓట్స్ నూడుల్స్‌ విత్ మిల్లెట్ మ్యాజిక్‌ ను ప్రారంభించడంతో కొత్త ఉత్పాదనను జోడించింది. దాదాపు మూడింట రెండు వంతుల భారతీయ కుటుంబాలు వినియోగిస్తున్న మ్యాగీ నూడుల్స్ భారతదేశంలో చిరుధాన్యాలను ప్రధాన స్రవంతిగా చేసేందుకు సానుకూలంగా దోహద పడనుంది. కొత్త ఉత్పాదన రెండు మిల్లెట్‌ల కలయికను అందిస్తుంది. మంచిత నంతో కూడిన ఓట్స్‌ తో పాటు జొన్న(జోవర్), రాగి(ఫింగర్ మిల్లెట్). మ్యాగీ చిరుధాన్యాలను ఆహ్లాదకరంగా చేయడానికి, అనుభవాన్ని మెరుగు పరచడానికి సువాసనగల మసాలా దిశను తీసుకుంది.

ఈ ఆవిష్కరణపై నెస్లే ఇండియా ఫుడ్స్ బిజినెస్ డైరెక్టర్ రజత్ జైన్ మాట్లాడుతూ.. ‘‘కొత్త మ్యాగీ ఓట్స్ నూడుల్స్‌ విత్ మిలెట్ మ్యాజిక్‌ ను చిరుధాన్యాల మంచితనంతో పరిచయం చేయడానికి మేం సంతోషిస్తున్నాం. వినూ త్నతలను విభిన్నంగా తీసుకురావడం ద్వారా వినియోగదారులకు విభిన్న ఎంపికలను అందించాలనే మ్యాగీ నిబ ద్ధతకు అనుగుణంగా ఈ ఆవిష్కరణ ఉంది. ఈ కొత్త ఉత్పత్తితో మేము ఓట్స్‌ ను భారతీయ చిరుధాన్యాలతో కలిపి వినియోగదారులకు ఫైబర్, ప్రొటీన్‌ల వనరుగా ఉండే ఉత్పాదనని అందించాం. భారత్ లో మా ఉనికి యొక్క నాలుగు దశాబ్దాలలో మేం మా వినియోగదారుల నుండి అపారమైన ప్రేమను పొందాం. మిలెట్ మ్యాజిక్‌తో కూడిన మ్యా గీ ఓట్స్ నూడుల్స్‌ ను మా వినియోగదారులు గతంలో మాదిరి ప్రేమ, ఉత్సాహంతో స్వీకరిస్తారని మేం విశ్వ సిస్తున్నాం’’ అని అన్నారు.

మిలెట్ మ్యాజిక్‌తో కూడిన మ్యాగీ ఓట్స్ నూడుల్స్ నెస్లే ఇండియా కొత్త మిలెట్ ఆధారిత ఉత్పాదనలలో ఒక భాగంగా వస్తుంది. నెస్లే R&D సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మనేసర్ (నెస్లే S.A యొక్క అనుబంధ సంస్థ, నెస్లే గ్లోబల్ R&D నెట్‌వర్క్‌ లో భాగం) మిలెట్ ప్రాసెసింగ్, ఆరోగ్యం, పోషకాహార ప్రయోజనాలు, మిలెట్ సస్టైనబుల్ రీజెనరేటివ్, వ్యవసాయ పద్ధతులు, స్టార్టప్ సహకారాలు వంటి రంగాలలో సహకరించే లక్ష్యంతో Nutri hub-IIMRతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాగీ హౌస్ నుండి వచ్చిన ఈ ఉత్పాదనతో వినియోగ దారులు 20 సుగంధ ద్రవ్యాలు & మూలికలను కలపడం ద్వారా ఒక టేస్ట్‌ మేకర్‌తో గొప్ప రుచిని పొందుతారు. మిలెట్ మ్యాజిక్‌తో కూడిన మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ప్రధాన మెట్రోలలో అందుబాటులో ఉంటాయి. 4 సర్వ్‌ ల (298గ్రా) ప్యాక్ ధర రూ.175గా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News