Monday, November 25, 2024

హలో! ఇండో-అరేబియా పత్రిక హక్కులను పొందిన భారతీయ వ్యాపారవేత్త

- Advertisement -
- Advertisement -

బియా బ్రాండ్స్ వెనుక ఉన్న వ్యాపార దిగ్గజం సుధాకర్ అడప, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ¡HOLA భాగస్వామ్యంతో మీడియా రంగంలోకి అడుగు పెట్టారు. ఈ ప్రవేశంతో అడప విలాసవంతమైన జీవనశైలి మ్యాగజైన్‌ లు హలో! ఇండో-అరేబియా, హలో అరేబియా!ను పోర్ట్‌ఫోలియోకి జోడించారు. పబ్లిషింగ్ రంగంలోకి ప్రవేశించిన మొదటి భారతీయుడిగా ఒక ముఖ్యమైన మైలురాయిని అడప చేరుకున్నారు.

హలో! ఇండో-అరేబియా, హలో! అరేబియా రెండూ అంతర్జాతీయ పేర్లతో పాటు జాతీయ ప్రముఖుల శ్రేణిని కలిగి ఉన్న విలక్షణమైన భారతీయ నైపుణ్యంతో నింపబడతాయి. ఈ ఆకట్టుకునే సమ్మేళనం పాఠకులను ఆకర్షించడమే కాకుండా భారతదేశం యొక్క విభిన్న సంస్కృతిని సగర్వంగా హైలైట్ చేస్తుంది

సుధాకర్ అడప వ్యవస్థాపకుడు & సీఈఓ, బియా బ్రాండ్స్ మాట్లాడుతూ.. “హలో! ఇండో-అరేబియా, హలో! అరేబియా పగ్గాలు చేపట్టడం నాకు గర్వకారణంగా వుంది. ఈ తరహా హక్కులను పొందిన తొలి భారతీయుడను తానే అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత ప్రత్యేకం. నిరంతరం అభివృద్ధి చెందుతున్న వ్యాపార దృశ్యంలో, బలమైన, ప్రపంచ బ్రాండ్‌లను నిర్మించడం మాకు అత్యవసరం. ఈ ప్రయాణంలో మీడియాది కీలకపాత్ర. హలో! ఇండో-అరేబియా, హలో! అరేబియా, రెండూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ, సెలబ్రిటీ మ్యాగజైన్‌లు, శక్తివంతమైన GCC దేశాలను యాక్సెస్ చేయడానికి మాకు ప్రత్యేకమైన అవకాశాలను ఇవి అందిస్తాయి” అని అన్నారు.

¡HOLA! గ్రూప్ ఛైర్మన్, ఎడ్వర్డో సాంచెజ్ పెరెజ్ మాట్లాడుతూ.. “హలో! ఇండో-అరేబియా, హలో! అరేబియాలు పెద్ద ¡HOLA!, హలో! కుటుంబంలో చేరినందుకు మేము సంతోషిస్తున్నాము. గల్ఫ్ ప్రాంతంలోని పాఠకులు స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకతలు, వార్తలు, మానవ ఆసక్తి కథనాలతో మాతో కలిసి జీవితాన్ని అత్యంత సుందరంగా వేడుక చేసుకుంటారు” అని అన్నారు. పాఠకులకు మరింతగా చేరువ కావటానికి హలో! ఇండో-అరేబియా ఆంగ్లంలో కనిపిస్తుంది. హలో! అరేబియా, అరబిక్ భాషలో లభిస్తాయి. ఇవి ప్రింట్, డిజిటల్ ఎడిషన్‌లను కలిగి ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News