Saturday, December 21, 2024

‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో విడుదల.. ఫాన్స్ కు పండగే

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీపై అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ను వదిలారు. ఈ మూవీ పస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ను ప్రోమోను విడుదల చేస్తూ పూర్తి సాంగ్ ను నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రోమోను చూస్తుంటే ఈ పాట రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అన్నట్లు ఉంది. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. దీంతో పూర్తి సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ మూవీలో మహేష్ బాబు సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News