ప్రపంచ కప్ వన్డే టోర్నీలో భాగంగా మరికాసేపట్లో భారత్- సౌతాఫ్రికా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఇప్పటివరకూ ఎదురు లేకుండా వరుసగా అన్ని మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ లో రెండు బలమైన జట్లు తలపడుతుండడంతో ఎవరు గెలుస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్, రవీంద్ర జడేజా, కుల్ దీప్, బుమ్రా, షమి, సిరాజ్.
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్, కేశవ్ మహరాజ్, కొయెట్జీ, రబడా, ఎంగిడి.