జైపూర్: భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. రాజస్థాన్‌లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. తాజా జాబితాలో పార్టీ ఉదయ్‌పూర్ జిల్లా మావ్లి అసెంvwha స్థానం సిట్టింగ్ ఎంఎల్ ధర్మనారాయణ్ జోషీని పక్కన పెట్టి ఆయన స్థానంలో స్థానంలో కెజి పలిదాల్‌కు టికెట్ ఇచ్చింది. జాబితాలో కొంత మంది కొత్త వాళ్లకు కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. కొత్త వాళ్లలో సివిల్ లైన్స్‌నుంచి గోపాల్ శర్మకు, ఆదర్శనగర్‌నుంచి రవి నయ్యర్‌కు అవకాశం కల్పించింది.
కాగా ఈ నెల 2న విడుదల చేసిన మూడో జాబితాలో కొలాయత్ స్థానంనుంచి రాష్ట్ర మాజీమంత్రి దేవీ సింగ్ భాటి కోడలు పూనమ్ సింగ్ భాటి పేరు ప్రకటించింది. అయితే తాజా జాబితాలో ఆమె స్థానంలో ఆమె కుమారుడు అన్షుమన్ సింగ్ భాటికి అవకాశం కల్పించింది. తాజా జాబితాతో రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకుగాను పార్టీ 198 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది. నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి తేదీ.