Saturday, November 23, 2024

కొడుకుల కోసం కొట్లాడుకొంటున్న కాంగ్రెస్ నేతలు: ప్రధాని

- Advertisement -
- Advertisement -

సియోని: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు తమ కుమారులను నాయకులుగా చేయడం కోసం రాష్ట్రంలో పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. శివ్‌పురిలో స్థానిక నాయకుడికి టికెట్ నిరాకరనించిందుకు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌బట్టలను చించేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ పిలుపునిస్తున్నట్లున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో పార్టీలో విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలు మొదయ్యాయి. అయితే ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రులయిన ఈ ఇద్దరు నాయకులు ఈ ఉదంతాన్ని తేలిగ్గా కొట్టి నారేయడమే కాకుండా కలిసి ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. కాగా ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నిలకు జరగనున్న రాష్ట్రంలో ప్రచారంలో భాగంగా సియోని జిల్లాలో ఆదివారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక 50 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ గిరిజనుల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.

పిఎం గరీబ్ యోజన’ను మరో అయిదేళ్లు పొడిగించనున్నట్లు కూడా మోడీ చెప్పారు. డిసెంబర్‌తో ఈ పథకం పూర్తి కావలసి ఉన్నప్పటికీ పేదప్రజల బాధ తనకు బాగా తెలిసినందున డిసెంబర్ తర్వాత కూడా మరో అయిదేళ్ల పాటు ఉచిత రేషన్ గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.. కొవిడ్ సంక్షోభ సమయంలో అన్నీ మూతపడినప్పుడు పేద ప్రజలు తమ పిల్లలకు ఎలా హారం అందించగలరనే విషయమే తనను ఎక్కువగా బాధించిందని, అప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ దేశ ప్రజలను ఆదుకోవడానికి పోరాటంచేయాలని నిర్ణయించుకున్నాని, ఆ నిర్ణయం ఫలితంగానే 80 కోట్ల మంది పేదప్రజలకు ఉచిత రేషన్ అందించి కటిక పేదరికంలో ఉన్నవారిని కూడా ఆకలి బాధనుంచి ఆదుకున్నామని ప్రధాని చెప్పారు.2014 కు ముందు కాంగ్రెస్ ప్రతి కుంభకోణం లక్షల కోట్లలో ఉండేదని, ఇప్పుడు బిజెపి ప్రభుత్వంలో స్కాములే లేవని చెప్పారు. పేద ప్రజల హక్కులను కాపాడేందుకు దాచిన సొమ్మును పేద ప్రజల రేషన్‌కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. బిజెపి గెలవబోతోందన్న గ్యారంటీ ప్రజలు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. రాజకీయాల్లో ఒక గ్యాంగ్ ఉంటుందని, ఏవో కొన్ని అంచనాలతో, ఒక నిశ్చితాభిప్రాయంతో అయిదు,

పది మందిని ప్రశ్నిస్తుంటుందని, లాంటి గ్యాంగులు ఇక్కడికి వచ్చి చూస్తే గెలుపు ఎవరిని వరించబోతుందో అర్థమవుతుందని ప్రతిపక్ష నేతలనుద్దేశించి మోడీ అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక ప్రధాని ఇక్కడికి వచ్చారని మా పార్టీ ఎంపి ఒకరు నాతోఅన్నారని, ఆదృష్టం తనకు దక్కిందని ప్రధాని అన్నారు. దేశంలో మొట్టమొదటి సారి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో బిజెపి అధికారంలోకి వచ్చాక గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని మోడీ చెప్పారు.మధ్యప్రదేశ్‌లో సుపరిపాలన, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి ఉంటే భరోసా ఉంటుందని, బిజెపి ఉంటే వికాసం ఉంటుందని, బిజెపి ఉంటే భవిష్యత్తు బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారని ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News