Sunday, January 19, 2025

తన పార్టీ మార్పు ప్రచారం కాంగ్రెస్ నాయకుల కుట్ర: డికె. అరుణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: త్వరలో తాను పార్టీ మారుతున్నట్లు పదే పదే కొన్ని ప్రచార మాధ్యమాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు బిజెపిలోనే కొనసాగుతానని కుండ బద్దలు కొట్టారు. బిజెపి నుంచి వలసలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్న విషయం సంస్ధలకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పార్టీ మార్పుపై మరోసారి తమ ఇష్టానుసారంగా ప్రచారాలు చేస్తే న్యాయ విచారణకు వెళతానని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News