Friday, December 20, 2024

మత్తు మందులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః యువతకు పిల్లలకు మత్తు మందు టాబ్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని హబీబ్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..హబీబ్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ రాంబాబు కథనం ప్రకారం… మల్లేపల్లి అఫ్జల్ సాగర్ కు చెందిన మేడ్ చక్రధరి (40). క్యాటరింగ్ పనిచేస్తున్నాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా కర్ణాటక బీదర్, పూణే తదితర ప్రాంతాలకు వెళ్లి మత్తుమందు టాబ్లెట్లను తీసుకువచ్చి స్థానికంగా ఉన్న యువతతో పాటు పిల్లలకు కూడా విక్రయిస్తున్నాడు.

ఈ టాబ్లెట్ల ద్వారా యువత మత్తులో ఉండి, అసాంఘిక కార్యక్రమాలు చేసే అవకాశం ఉండడంతో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అతనిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే నైట్రోవేట్ 3420 టాబ్లెట్లతో పాటు 22 కోడ్ పాస్పోట్ అండ్ క్లోరోఫేన్ రమయాన్ సిరప్లను కూడా విక్రయిస్తున్నాడు. చక్రధర్ గతంలో గోపాలపురం శంషాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పిక్ ప్యాకెట్ల కేసులు నమోదయాయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుని పోలీసులు రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు. ఈ కేసులో చక్రధర్ సోదరి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News