Saturday, November 23, 2024

విశ్వకర్మ బంధు కోసం కృషిచేస్తాం

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనాచారి

మన తెలంగాణ /హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి అనేక సంవత్సరాలుగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటూ వస్తోందని, ఈ విశ్వకర్మ బంధు కోసం కృషిచేస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మీ జాతి ముద్దు బిడ్డగా మన సమస్యల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. ఆదివారం ఉప్పల్ బగాయిత్‌లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రాంగణంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో పాల్గొని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి జరుగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తాను కూడా విశ్వకర్మ బంధు కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ విశ్వకర్మలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే చైనా బజార్లు.. ఇండియా బజార్లుగా మారుతాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం విశ్వకర్మల కోసం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన ప్రదేశంలోనే విశ్వకర్మ గర్జన సభ జరగడం మన ఆత్మ గౌరవానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆ తోవలోనే ముందుకు సాగుతోందన్నారు. విశ్వకర్మల హక్కుల సాధన అండగా నిలుస్తానని ఈ సందర్బంగా జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.

విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి పెద్దలు డాక్టర్ లాలుకోట వెంకటాచారి, డాక్టర్ వేములవాడ మదన్మోహన్, చొల్లేటి కృష్ణమాచార్యులు, రాళ్ళబండి విష్ణు,తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి, బిసి కమిషన్ మెంబర్ బ్రహ్మశ్రీ చిట్టోజు ఉపేంద్రాచారి, డాక్టర్ అమరవాది ప్రభాకరా చారి, సుంకోజి కృష్ణమాచారి, పులిగిళ్ళ శ్రీనివాసా చారి, రామడుగు నరసింహాచార్య స్వామి, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బైరోజు వెంకట రమణాచారి, దానకర్ణాచారి, కుందారపు గణేష్ చారి, 33 జిల్లాల సంఘాల అధ్యక్షులు, నాయకులు, రాష్ట్ర మనుమయ సంఘం, రాష్ట్ర స్వర్ణకార సంఘం, రాష్ట్ర శిల్పి పారిశ్రామిక సంఘం, రాష్ట్ర ఇత్తడి పారిశ్రామిక సంఘం, రాష్ట్ర మహిళా సంఘం నాయకులు,విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి సర్పంచులు, ఉద్యోగ సంఘాల నేతలు, న్యాయవాదులు, యువజనులు, విద్యార్థులు, అందరు సమైక్య శంఖారావం పూరించారు. ఈ బహిరంగ సభలో దాదాపు 20 వేల మంది విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News