Friday, December 20, 2024

సచిన్ సరసన కింగ్

- Advertisement -
- Advertisement -

49 వన్డే శతకాలతో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
అభిమానులకు పుట్టినరోజు కానుక

సఫారీలపై టీమిండియా ఘన విజయం

ఎదురులేని భారత్

క్రికెట్ రారాజుగా పిలుచుకునే విరాట్ కోహ్లీ మరో ఘనతను అందుకున్నాడు. క్రికెట్ క్రీడకే ఆరాధ్యుడిగా పేరున్న మరో దిగ్గజం, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. వన్డే మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు 49 శతకాలతో అంతర్జాతీయ రికార్డును మోస్తున్న సచిన్‌కు తా జాగా కోహ్లీ చేరువయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఆదివారంనాడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో 101పరుగులతో శతకాన్ని బాది కోహ్లీ పతాక శీర్షికలకెక్కాడు. సరిగ్గా 35వ పుట్టిన రోజునే అజేయ శతకంతో కొత్త రికార్డు నెలకొల్పి అభిమానులకు అంబరాన్ని తాకే సంబరానిచ్చాడు. దీంతో పెద్ద ఎత్తున్న సామాజిక మా ధ్యమాల్లో కోహ్లీ అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు బాదితే.. కోహ్లీ మాత్రం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ అరుదైన ఫీట్‌ను సొంత చేసుకోవడం విశేషం. కోహ్లీ మాట్లాడుతూ ఈ ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ ఆటగాడికైనా ఇదొక కల అన్నారు. సచిన్ కూడా కోహ్లీని అభినందిస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. మరోవైపు ఆదివారంనాటి మ్యాచ్‌లో సఫారీలపై టీమిండియా చెలరేగిపోయింది. భారీ విజయంతో ప్రపంచకప్‌లో తమకు ఎదురులేదని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News