Saturday, November 23, 2024

రానున్నది ప్రాంతీయ శకమే

- Advertisement -
- Advertisement -

ఢిల్లీకి గులాములం కావొద్దు…మనల్ని మనమే పాలించుకుందాం

కెసిఆర్ ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమే

ఢిల్లీలో స్విచ్ వేస్తేనే ఇక్కడ కాంగ్రెస్ లైట్ వెలుగుతోంది

మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే

సీతారామ ప్రాజెక్టును నేనే ప్రారంభిస్తా
విచక్షణతో ఓట్లు వేయండి.. ప్రజాస్వామ్యానికి పరిణతి తీసుకురండి

ఖమ్మం, కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపి పొంగులేటిపై విసుర్లు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/భద్రాద్రి కొత్తగూడెం : దేశం లో రాబోయే రోజుల్లో ప్రాంతీయపార్టీలదే యుగమని రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరావు అన్నా రు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రా ల్లో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సిఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాం గ్రెస్ వాళ్ళకు ఓట్లు వేసి ఢిల్లీ వాళ్ళ క్రింద గులాంలం అవుద్దా మా? లేక మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవడం ఉత్తమమా ? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడివాళ్ళు అక్కడ ఉంటేనే ఆ రా ష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటారని, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనమే సరిచేసుకుంటామని, ప్రతి దానికి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నారు. ఈవిషయాన్ని ఖమ్మంలో ప్రకటిస్తున్నానని కెసిఆర్ ఆనాడే చెప్పారు, అదే నిజమైందని మళ్ళీ మీరే అంటారని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల కథ మరో రకంగా ఉంటుందని, ఢిల్లీలో స్వి చ్ వేస్తేనే లైట్ వెలుగుతుదని, మరి ఢిల్లీ గులాంల క్రింద ఉండి మనం గులాంలం అవుద్దామా ? లేక మనం మనమే పాలించుకుందామా? మీరే ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణలో కెసిఆర్ బ్రతికి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సెక్యూలర్ రాష్ట్రంగా విరాజిల్లుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడారు.ఈదేశాన్ని పాలించిన కాంగ్రెస్ ముస్లింలను ఓటు బ్యాంక్ గా వాడుకుందే గాని వారి గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నా రు. పదేళ్ళ క్రితం కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ముస్లింల సంక్షే మం కోసం రూ.900 కోట్లు కేటాయిస్తే తెలంగాణ వచ్చిన తరువాత రూ.12 వేల కోట్లను కేటాయించామన్నారు. ముస్లిం మైనార్టీ పిల్లల విద్య కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చే యడం ద్వారా ముస్లిం సోదరులు తనను ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంతో పాటు కొత్తగూడెం, ఇల్లెందు పట్టణాల్లో ఉద్యమం సమయంలో పర్యటించాననని, అల్లా దయతో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. నా నాకంఠంలో ప్రాణం ఉన్నంత వ రకు కుల,మత ప్రాతిపదికన రాజకీయాలను చేయబోనని, తెలంగాణలో ప్రజలంతా స్వేచ్ఛా వాయివులతో జీవిస్తున్నారని, మళ్ళీ రాబోయేది కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన అ న్నారు.

ఖమ్మం నగరంలోని ముస్లిం సోదరులంతా అజయ్ కుమార్‌ని ప్రేమగా అజయ్ ఖాన్‌గా పిల్చుకుంటారని తాను వి న్నానని అదే ప్రేమతో మళ్ళీ అజయ్ కుమార్‌ను గెలిపించాలని ఆయన ముస్లిం సోదరలుకు ఉర్దూ భాషలో విజ్ఞప్తి చేశారు.‘బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు ఎప్పుడైనా తెలంగాణ జెండాను ఎత్తుకున్నారా? తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోసుకున్నా రా? మనం ఎత్తుకున్నప్పుడల్లా మనల్ని అవమానించారు కాల్చి చంపారు. జైల్‌లో పెట్టారే తప్ప వీరికి ఎందుకు ప్రేమ ఉంటుందని’ ఆయన ప్రశ్నించారు. కనుక ఓట్లు వేసే ముందు వెనుక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని, వచ్చే ది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన పనులు పూర్తి చేసి నేనే వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సమైఖ్య రాష్టం ఉంటే కొత్తగూ డెం జిల్లా అయ్యేది కాదన్నారు. జిల్లా అయినందుకే ప్ర భుత్వ మెడికల్ కళాశాల వచ్చిందన్నారు. ఈ నియోజకవర్గంలో 13500 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశామన్నారు. 50 ఏళ్ళ కాలంలో కాని పనులన్నింటిని బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు.
ఆయన నాకే మంత్రి పదవి ఇచ్చాడంటా?
ఈ జిల్లాలో గొప్పవాడు ఒకాయన ఉన్నాడు ఆయన ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆ యన నాకే మంత్రి పదవి ఇచ్చాడని చెప్పుకుంటున్నారని, సిఎం కెసిఆర్ పరోక్షకంగా మాజీ మంత్రి తుమ్మలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే అజయ్ మీద పోటీ చేసి ఓడిపోతే పిలిచి మంత్రిని చేసి జిల్లాను అప్పగిస్తే ఆయన సాధించిన ఫలితం గుండుసున్నా మిగిల్చాడని, ఒక అజయ్ మాత్రమే గెలిచారన్నారు. చిన్నయసూరి రాసిన కథలో పేర్కొన్న ఇద్దరు పాత్రదారులు కరటకదమకలు గురించి ఒక సారి చదివితే ఈ ఇద్దరి గురించి పూర్తిగా తెలుస్తుందని, లేదంటే మీదగ్గర లో ఉన్న తెలుగు మాస్టర్లను అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ ఇద్దరి పీడవదిలిపోయి శుభ్రంగా ఖమ్మం జిల్లా ఉందని, ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయని, ఇందులో ఎవ్వరికి కూడా అనుమానం లేదన్నారు.
ఆయనేమన్నా ఖమ్మం జిల్లాను గుత్తా పట్టాడా?
‘ప్రజాస్వామ్యంలో మాటలకు కూడా ఒక పరిమితి ఉం టుందని, మాటలు అందరికి వస్తాయని, తిట్టాలంటే తి ట్లు తక్కువ ఉన్నాయా? రేపు ఇవ్వాల్టి వరకు తిట్టాచ్చు వ రుసబట్టి ..అది కాదు కదా, రాజకీయం అంటే… అరాచకంగా మాట్లాడొద్దు కదా బిఆర్‌ఎస్ పార్టీ వాళ్ళను ఒక్కరి ని కూడా అసెంబ్లీ గడపతొక్కనివ్వనని ఓ అర్బకుడు మా ట్లాడుతున్నాడని ఆయన ఏమైనా ఖమ్మం జిల్లాను గుత్తబట్టి కొనేశాడా? జిల్లాకు జిల్లానే కొనేశాడా? అంటూమా జీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి అరచకాన్ని ఖమ్మం జిల్లా ప్రజ లు సహిస్తారా? ప్రజాస్వామ్యవాదులు సహిస్తారా? ఇది ఎంత వరకు ధర్మం.. ఇది చైతన్యవంతమైన జిల్లా.. ఇది పోరాటాల జిల్లా.. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఎంతో చై తన్యాన్ని తీసుకొచ్చాయి. విచక్షణాయుతంగా ఎవరు గెలి స్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ సురక్షితంగా ఉంటదో ఆలోచించాల ని” ఆయన కోరారు
విచక్షణతో ఓట్లు వేయండి ..
ప్రజాస్వామ్యానికి పరిణితి తెండి
ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం 75 సంవత్సరా ల స్వతంత్ర భారతవనిలో ప్రజాస్వామ్యానికి పరిణితి ఈదేశంలో ఇంకా రాలేదన్నారు. ప్రతి ఐదేళ్ళకోసారి ఎ న్నికలు వస్తాయి పోతాయి. రెండులేదా మూడు పార్టీలు పోటీ చేస్తాయి. ఆ ఎన్నికల్లో ఎవ్వరో ఒక్కరూ గెలుస్తారు కానీ ఇది కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల్లో పార్టీలు కాదు ప్రజలు గెలువాలని సిఎం కెసిఆర్ ప్రజలకు సూ చించారు. సొంతంగా విచక్షణతో ఓట్లు వేస్తనే ప్రజాస్వా మ్యం పరిణితి చెందుతుందన్నారు. ప్రజాస్వామ్యానికి పరిణిత వచ్చేందుకు యువత కృషి చేయాలని కోరారు. ఈ అంశంపై యువకులంతా బస్తీల్లో చర్చించాలని ఆయ న వేడుకున్నారు. ఎన్నికల్లో పార్టీలను చూడకుండా అభ్యర్థుల మంచి చెడు గుణగణాలు చూడాలని, సేవ చేస్తాడా లేదా గెలిచిన తరువాత హైదరాబాద్‌కు వెళ్తాడా? అనేది చూడాలన్నారు. ప్రతి అభ్యర్థి వెనుక ఓక పార్టీ ఉంటుంద ని, ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును తిర్చిదిద్దుతుందని, మన తలరాతలను రాస్తుందన్నారు. విచక్షణతో ఓట్లు వేస్తే వా ళ్ళు కాదు గెలిచేది మీరు (ప్రజలు) గెలుస్తారని’ సిఎం కెసిఆర్ అన్నారు. ఓటు వజ్రాయుదం లాంటిదని, మంచి భవిష్యత్తును ఇచ్చేది కూడా ఓటే అని, చైతన్యవంతులైన పట్టణవాసులు ఆలోచించి నిజనిజాలను చర్చించాలని ఆ యన కోరారు. పోరాటాల జిల్లా, చైతన్యం కలిగిన జిల్లా, కమ్యూనిస్టుల జిల్లా కనుక విచక్షణతో ఆలోచించి ఎవరి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే సుభిక్షంగా ఉంటుందో ఆలోచించి ఓట్లు వేయాల ప్రజలకు పిలుపు నిచ్చారు.
సింగరేణి కార్మికులతో గత పాలకుల చెలగాటం
సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తిగా చెపుతూ గతంలో పరిపాలించిన పాలకులు అప్పులు చేసి వడ్డీలు కూడా చెల్లించకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వందకు వంద శాతం సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించి ప్రగతిపథంలో నిలిపామని గుర్తు చేశారు. ఒకనాడు టర్నోవర్ రూ.11వేల కో ట్లు ఉన్న దశలో నేడు రూ.33 వేల కోట్లకు సంస్థ చేరింద ని, అదే సమయంలో కార్మికులకు లాభాల వాటాలను 2184 కోట్ల రూపాయలు పెరిగిన విషయాన్ని వివరించా రు. విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా ప్రవేశించి అద్భుతమైన టర్నోవర్‌తో తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి సింగరేణి వెలుగులు అందిస్తుందని ప్రశంసించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా పూర్తి అయితే మరో 4800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఏఐటియుసి, ఐఎన్‌టియుసి ఇతర సంఘా లు సంస్థను భ్రష్టు పట్టించేలా వ్యవహరించారని మండిపడ్డారు. కార్మిక లోకం గమనించి మరోసారి బిఆర్‌ఎస్‌తో పాటు అనుబంధ యూనియన్ టిబిజికెఎస్‌కు మద్దతు పలకాలని కోరారు. భద్రాద్రి జిల్లా చైతన్యాల పురిటిగడ్డగా అభివర్ణిస్తూ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటాలు మరోసారి తన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపామని, వ్యవసాయకంగా సీతారామ ప్రాజెక్టు పూర్తి కాగానే ప్రతీ ఎకరం సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు. నేడు ఇంటింటికీ నల్లా వస్తుందని, మంచినీటి కోసం గోసపడ్డ ఆడబిడ్డల బాధలు తీర్చిన ఘనత తమదేనని దీ మాగా చెప్పారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రై తుబంధు, బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగా ణ అని తేల్చి చెప్పారు. విద్య, వైద్య రంగంలో కూడా అ ద్భుతమైన ప్రగతిని సాధించామని నేడు కళ్ల ముందు కనిపిస్తున్న గురుకులాలు, మెడికల్ కళాశాలలు ప్రత్యక్ష నిదర్శనమని, మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజినీర్లుగా రాణిస్తున్నారని సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. జిల్లాకు ఒ క మెడికల్ కళాశాల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దళితబంధు, గిరిజన బిసి బంధు తన మదిలో మెదిలిన అద్భుతమైన పథకాల ని, చివరి దళిత బిడ్డ వరకు అమలు చేస్తామని వారు అ న్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తమ ఆకాంక్షగా చెప్పా రు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళిత, గిరిజన, బి సి, మైనార్టీ వర్గాలను వాడుకున్న పార్టీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి అని, వ్యక్తిగతంగా, కుటుంబం కోసం ఏనాడు తన వద్ద ప్రస్తావించలేదని, అటువంటి మంచి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని రో డ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, స్మశాన వాటికల ఏర్పాటు, రైతు వేదికలు అభివృద్ధికి చిహ్నాలుగా నిలుస్తాయన్నారు. వరదల కారణంగా ముర్రేడు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ముంపు ప్రాంత ప్రజలను, పరిసర ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నందున, రిటైనింగ్ వాల్ కోసం రూ.40 కోట్లతో మంజూరు చేశామని త్వరలోనే నిర్మాణ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. తమకోసం పనిచేస్తున్న పార్టీని గుర్తించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించడం ద్వారా స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును మరోసారి అసెంబ్లీకి పంపించి అభిమానాన్ని చాటుకోవాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు.

ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్నంత సేపు సభకు హాజరైన అశేష జనవాహిని ఆయనకు మద్దతు పలుకుతూ హర్షద్వానాలు చేశారు. ఈలలు, చప్పట్లతో ఉత్సాహపరిచా రు. ప్రతిపక్ష నేతలపై ఆయన వేసిన సెటైర్లకు మంచి స్పందన లభించింది. ప్లకార్డులతో గోల చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు సభలో నవ్వులు పూయించాయి. సభ ముగిసిన వెంటనే ప్రజలకు అభివాదం చే స్తూ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ బహిరంగ సభల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోక్ సభలో బిఆర్‌ఎస్ పక్షనేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, డా బండి పార్దసారధి రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర య్య, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, వైరా ఎ మ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ, బిఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు, మధిర, వైరా బిఆర్‌ఎస్ అభ్యర్థులు లింగాల కమల్ రాజు, బానోతు మదన్ లాల్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, డిసిఎం ఎస్‌చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగల రాజేందర్, జిల్లా బిఆర్‌ఎస్ ఎన్నికల సమన్వయ కర్త ఆర్‌జెసి కృష్ణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ డా.శ్వేత, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కు మార్, మాజీ ఎమ్మెల్యే డా.చంద్రావతి, రాష్ట్ర విత్తనాభివృ ద్థి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మాజీ జిహెచ్‌ఎంసి మేయర్ రాంమ్మోహన్ రావు, పలువురు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు మండల పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News