Tuesday, November 26, 2024

వర్గీకరణపై తాత్సారమెందుకు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎస్‌సి రిజర్వేష న్ల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పె ట్టి ఆమోదించాలని మంత్రి హరీశ్‌రావు కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్ట్ వద్ద మాదిగల యుద్ధభేరి సభలో హరీశ్ రావు ము ఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎంఆర్‌పిఎస్ పోరాడుతోందని ఆయన తెలిపారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి కెసిఆర్ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధ్దికి ఇది నిదర్శనమని అన్నారు. వర్గీకరణ కోసం రెండో సారి కూడా కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపామన్నారు. ఒకసారి అప్పటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య, కడియం శ్రీహరిలతో తీర్మానం కాపీలను ఢిల్లీకి పంపామని, మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రధాని మోడీ చేతికి అసెంబ్లీ తీర్మానం కాపీని అందజేశారని గుర్తు చేశారు.

మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోందన్నారు. రాష్ట్ర శాసన సభ పంపిన తీర్మానంపై పా ర్లమెంటులో ప్రత్యేక చట్టం చేయడానికి మోడీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో తెలియదని పేర్కొన్నారు. ఎస్‌సి వర్గీకరణ బిల్లును తీసుకురావాలని బిఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతీ జిల్లాకు ఒక ఎస్‌సి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి దళిత విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు తీసుకొచ్చారని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్ సి గురుకులం, 50 ఎస్‌సి మహిళా డిగ్రీ కాలేజలను ఏర్పాటు చేసిన ఘన త కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎస్‌సిలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా గుర్తిస్తామని మేనిఫెస్టోలో పెట్టామన్నా రు.

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో మాదిగల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మిస్తామని, హైదరాబాదులో సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామినిచ్చారు. బిఆర్‌ఎస్ ఉద్యమ పార్టీ కాబట్టి ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఉద్యమాన్ని గౌరవిస్తుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డైట్, శానిటైజేషన్ విభాగాల్లో ఎస్‌సి రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇరిగేషన్ కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ తెచ్చామన్నారు. మళ్ళీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాబోయే రోజుల్లో ఎంఎల్‌సి, నామినేటెడ్ పదవుల్లో , ఇతర అవకాశాల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళనున్నట్లు హామీనిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News