Friday, November 22, 2024

ఇండియా చేతిలో ఘోర ఓటమి.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

- Advertisement -
- Advertisement -

ఇండియా చేతిలో శ్రీలంక ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశంలో పరిణామాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. శ్రీలంక జట్టు ఓటమి తరువాత ఆ దేశ క్రికెట్ బోర్డు కార్యదర్శి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా  శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ, లంక క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నాయకత్వంలో ఒక తాత్కాలిక కమిటీని నియమించింది. ‘బోర్డులో సభ్యులంతా తమంతట తాముగా రాజీనామా చేస్తే బాగుండేది. కానీ వారు చేయకపోవడంతో మేమే ఈ నిర్ణయం తీసుకున్నాం. లంక బోర్డులో అవినీతి మితిమీరిపోయింది‘ అని క్రీడామంత్రి రోషన్ రణసింగే వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా, శ్రీలంక తన తదుపరి లీగ్ మ్యాచ్ లో సోమవారం బంగ్లాదేశ్ ను ఢీకొంటోంది. శ్రీలంక, ఇండియా మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ఇండియా 358 పరుగులు చేయగా, లంక కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో లంక జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిని ఘోరమైన అవమానంగా భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News