Monday, December 23, 2024

నెట్ ఫ్లిక్స్ కు వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వీడియో రైట్స్?

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్ళి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటలీలోని టస్కనీలో వీరి పెళ్లి నవంబర్ 1న అంగరంగవైభవంగా జరిగింది. మెగా హీరో చిరు కుటుంబంతోపాటు బంధువులంతా ఈ పెళ్లికి తరలివెళ్లారు. వరుణ్- లావణ్య హైదరాబాద్ తిరిగొచ్చాక, ఇచ్చిన రిసెప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా వచ్చి, వధూవరులను అభినందించారు. ఇదిలా ఉంటే, ఇటలీలో జరిగిన వరుణ్- లావణ్య వివాహానికి సంబంధించిన వీడియో రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ పెళ్ళి వేడుక స్ట్రీమింగ్ కోసం నెట్ ఫ్లిక్స్ 8 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News