Monday, December 23, 2024

కొడంగల్ చరిత్రను తిరగరాస్తారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ ఎన్నికలతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో నామినేషన్ వేసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో విద్యార్థుల భవిష్యత్ మారుతుందని, కొడంగల్ చరిత్రను ప్రజలే తిరగరాస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కొండగల్‌ను అభివృద్ధి చేస్తామని సిఎం కెసిఆర్ మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. ఈ ఎన్నికలు కొడంగల్ వర్సెస్ కెసిఆర్ మధ్య జరుగుతున్నాయని చెప్పారు. కొడంగల్ బిడ్డ తెలంగాణకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. కొడంగల్‌లో తనని ఓడించేందుకు కెసిఆర్, కెటిఆర్ యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో గతంలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించినా అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News