- Advertisement -
తెలంగాణ ఎన్నికలను ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజానీకానికి మధ్య జరుగుతున్న పోరాటంగా మంత్రి కెటీఆర్ అభివర్ణించారు. తెలంగాణను ఆగం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని ఆయన విమర్శించారు. వేములవాడలో జరిగిన యువ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ కడక్ వంద రూపాయల నోటులాంటి వారనీ, కాంగ్రెస్, బీజీపీవాళ్ళు చిల్లరలాంటి వారనీ ఎద్దేవా చేశారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పరిష్కరించలేకపోయిన సాగు నీరు, తాగు నీరు సమస్యలను, కరెంటు సమస్యలను కేసీఆర్ పరిష్కరించారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే, నియోజకవర్గాన్నితాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. సెంటిమెంట్లకు పడిపోవద్దని, కులం కూడుపెట్టదని కేటీఆర్ హితవు చెప్పారు.
- Advertisement -